Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్ నుంచి భారత జవాను తిరిగొచ్చాడు

జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నది వద్ద పహారా కాస్తూ, ప్రమాదవశాత్తు నదిలో పడి కొట్టుకుపోయిన భారత జవాను పాకిస్థాన్ సైన్యానికి పట్టుబడిన సంగతి తెలిసిందే. ముప్ఫై ఏళ్ల సత్యశీల్ యాదవ్ పాకి్స్థాన్ నుంచి ఇవాళ స్వదేశానికి తిరిగి వచ్చారు. నది వద్ద పహారా బాధ్యతలు నిర్వహిస్తున్న భారత జవాన్ల బృందం పడవ ప్రమాదంలో చిక్కుకోగా, సత్యశీల్ గల్లంతయ్యాడు. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. అతడిని అదుపులోకి తీసుకున్న పాకిస్థాన్ సైన్యం విచారణ అనంతరం భారత అధికారుల విజ్ఞప్తి మేరకు సురక్షితంగా తిరిగి పంపించింది. పాక్ అధికారులు తనను మర్యాదగా చూసుకున్నారని సత్యశీల్ చెప్పాడు.

More Telugu News